10 రోజుల నుంచిఎదురు చూస్తున్నా..
ధాన్యం కోతవేసి కొనుగోలు కేంద్రం వద్దకు ట్రాక్టర్ల ద్వారా తరలించాను. ఽమూడు రోజులు ధాన్యం ఆరబెట్టాను. ఽతేమ శాతం చూసి ఎంపిక చేశారు. ధాన్యం నింపడం కోసం గన్నీ బ్యాగులు ఇవ్వాలని అధికారులను కోరితే మిల్లులు ఎంపిక కాలేదు. కొనుగోలుకు ఆలస్యం అవుతుందని చెప్పారు. పది రోజుల నుంచి ఇక్కడే ధాన్యం రాశుల వద్ద రాత్రింబవళ్లు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలి.
– అంజయ్య, రైతు, కన్మనూర్
కర్ణాటక వ్యాపారులకు అమ్మేశా..
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలుకు ముందుకు రాలేదు. అధికారులను అడిగినా గన్నీబ్యాగులు ఇవ్వలేదు. చేసేంది లేక బోనస్‌పై ఆశ పెట్టుకోకుండా ఆరటెట్టిన ధాన్యాన్ని కర్ణాటక వ్యాపారులకు విక్రయించాను.
– నర్సింహులు, మరికల్
మిల్లులు ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాం
మారిన నిబంధనలకు మిలర్లు ఒప్పుకోలేదు. అందుకు ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుంది. జిల్లాలోని మిల్లులను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. ఏఈవోలు ఎంపిక చేసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తాం. – సుదర్శన్, డీఎస్‌ఓ
●
Comments
Please login to add a commentAdd a comment