వాతావరణం
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో ఉదయం చలి ఉంటుంది. రాత్రి సమయంలో చలితోపాటు మంచు కురుస్తుంది.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : ఎస్పీ
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురు తమ ఫిర్యాదులను నేరుగా ఎస్పీని కలిసి విన్నవించారు. రెండు ఫిర్యాదులు ఫ్యామిలీ గొడవలకు సంబంధించినవి కాగా, 3 భూ–తగాదాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, సామరస్యంగా మాట్లాడుకోవాలని ఎస్పీ సూచించారు. బాధితులు తీసుకువచ్చే ఎలాంటి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచరాదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందని, ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించి వారికి సరైన న్యాయం అందించి భరోసా, భద్రత కల్పించాలని సూచించారు.
ధాన్యంతో కిక్కిరిసిన బాదేపల్లి యార్డు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు పంట దిగుబడులతో కిక్కిరిసింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి 9,326 క్వింటాళ్ల ధాన్యం యార్డుకు విక్రయానికి వచ్చింది. ఇంత ధాన్యం యార్డుకు రావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారిగా అధికారులు తెలిపారు. అదేవిధంగా 2081 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలు గరిష్టంగా రూ.2,417, కనిష్టంగా రూ.1,912 ధరలు లభించగా ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.1,550, హంస రకం రూ.2,011, రాగులు రూ.2,222, వేరుశనగ గరిష్టంగా రూ.6,213, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment