రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
దామరగిద్ద: వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని మల్‌రెడ్డిపల్లి, లోకూర్తి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఆమె పర్యవేక్షించారు. సన్నరకం ధాన్యం విక్రయించే రైతులకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందని, బోనస్ వస్తుందో రాదో అనే అనుమానం పెట్టుకోవద్దని రైతులకు సూచించారు. మల్‌రెడ్డిపల్లి కేంద్రంలో ప్యాడీ క్లీనర్ యంత్రంలో వరిధాన్యం వేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని అక్కడి సిబ్బంది తెలపడంతో కలెక్టర్ ధాన్యాన్ని యంత్రంలో వేసి క్లీనింగ్ ప్రక్రియను, గింజ పొడవు, వెడుల్పులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు సన్నరకం ధాన్యానికి బోనస్ డబ్బులు వారి ఖాతాల్లో జమచేస్తారన్నారు. లావురకం ధాన్యం కేంద్రాలకు రావడం లేదని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా కేంద్రాల్లో ఎంతమేర ధాన్యం కొనుగోలు చేశారని ఆరా తీశారు. అలాగే, సమగ్ర కుటుంబ సర్వేను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట సివిల్‌సప్‌లై ఎండీ దేవదాస్, ఎంపీడీఓ సాయిలక్ష్మి, ఐకేపీ ఏపీఎం నర్సిములు ఉన్నారు.
రూ.500 బోనస్‌పై అనుమానం వద్దు
కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment