ముదిరాజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి..
బీీస జనాభాలో సగభాగం ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యత లేదు. రాష్ట్రంలో 12,760 గ్రామాలకు గాను 8వేలకుపైగా గ్రామాల్లో ముదిరాజ్‌ల జనాభా అధికంగా ఉంది. వందశాతం ముదిరాజ్‌లు ఉన్న గ్రామాలు వందల్లో ఉన్నా రాజకీయ ప్రాధాన్యత లేదు. స్థానిక సంస్థల్లో ముదిరాజ్‌ల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి.
– కృష్ణ ముదిరాజ్, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కులగణన ఆధారంగా..
ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో వచ్చిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలి. జిల్లాలో అత్యధికంగా బీసీలు ఉన్నారని, రేపు కులగణన జరిగిన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. – శ్రీనివాస్‌సాగర్,
బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment