
ఆటోలో ప్రయాణించడంతో డబ్బులు అడగ్గా ఓ మహిళ డ్రైవర్‌ను చితక్కొట్టింది. దీంతోపాటు బూతులు తిడుతూ దుర్బాషలాడింది.
లక్నో: ఆటోలో ప్రయాణించినంత సేపు ప్రయాణించి డబ్బులు అడగ్గా కొంత ఇచ్చేసి మిగతా ఇవ్వను అని ఓ మహిళా ప్రయాణికురాలు తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో డ్రైవర్‌కు ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక సహనం కోల్పోయిన ఆ మహిళ చెప్పు తీసుకుని ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అంతకుముందు చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నడిబొడ్డున జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
(చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు)
లక్నో టెది పులియా ప్రధాన చౌరస్తాలో ఆగస్ట్ 21వ తేదీన ఈ ఘటన జరిగింది. వారి వివరాలు తెలియలేదు. కానీ ఆటో డ్రైవర్ ఒకచోట ఆ మహిళతో పాటు ఆమెకు సంబంధించిన ఇద్దరు యువకులను ఎక్కించుకున్నాడు. టెది పులియాకు చేరుకోవడంతో డ్రైవర్ డబ్బులు అడిగాడు. ఆమె సగం చెల్లించి వెళ్తుండగా ఆటో డ్రైవర్ మిగతా డబ్బు అడగ్గా ఆ మహిళ దుర్బాషలాడింది. ఆమె బూతు పురాణం కూడా మొదలుపెట్టడంతో సరిగ్గా మాట్లాడాలి ఆటో డ్రైవర్ చెప్పాడు. అనంతరం ఆమెతో వచ్చిన ఇద్దరు యువకులు అతడితో గొడవకు దిగారు.
ఈ విషయాన్ని అక్కడ సమీపంలో ఉన్న పోలీస్‌కు ఆటో డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. పోలీస్ వచ్చి మాట్లాడుతుండగా రెచ్చిపోయిన ఆ మహిళ డ్రైవర్‌ను మొదట చెంపపై కొట్టింది. అనంతరం చెప్పు తీసి అతడిపై దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు చేరలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. ఆమె తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు అడిగితే కొట్టుడు ఏంది? అని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ‘అమ్మాయిలూ ‘జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’
विवाद किराए का, हिसाब चप्पल से।
— Gyan Bihari Mishra (@Gyanmishra_) August 21, 2021
थप्पड़ गर्ल के बाद अब चप्पल वाली महिला। लखनऊ के टेढ़ी पुलिया चौराहे का वीडियो वायरल। pic.twitter.com/HV8R8PMEdV