అవినీతి పరులు ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు ఎలా ఇవ్వాలనే దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అవినీతి బాధితులకు ఇప్పటికే రూ.17,000 కోట్లు తిరిగిచ్చామని అన్నారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో స్వాధీనం చేసుకున్న డబ్బులో మరో రూ. 1.25 లక్షల కోట్లను బాధితులకు తిరిగి ఇవ్వనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
కేరళలో కోఆపరేటివ్ బ్యాంకుల్లో కుంభకోణం జరిగింది. వీటిని ఎవరిని నియంత్రిస్తున్నారో అందరికి తెలుసు. ఆ డబ్బు మధ్యతరగతి, పేదలకు చెందినది. ఇందులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకుల ఆస్తులను అటాచ్ చేశాం. దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. అవినీతి సొమ్మును బాధితులకు ఇప్పటికే రూ. 17,000 కోట్లు చెల్లించినట్లు మోదీ తెలిపారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ మరో రూ.1.25 లక్షల కోట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఆ విషయం టీవీల్లో కూడా వచ్చింది. ఆ డబ్బంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందింది. దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని ప్రధాని మోదీ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment