నిర్మల్: కమలం కూడా కాంగ్రెస్ బాటలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. తమ పార్టీ నుంచి ఎ మ్మెల్యేగా పోటీ చేయాలనుకునే ఆశావహులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 4నుంచి 10వ తేదీవరకు హైదరాబాద్ నాంపల్లి లోని రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవా లని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి రెండురోజుల క్రితం ప్రకటించారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఈ తరహాలో అప్లికేషన్లు స్వీకరించింది. అభ్యర్థు ల ఎంపిక ప్రక్రియనూ ఓ కొలిక్కి తీసుకువస్తోంది. అధికార బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించేసింది. జిల్లాలో నిర్మల్ మినహా ముధోల్, ఖా నాపూర్ రెండుచోట్లా పోటాపోటీగా ఆశావహులు ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. పార్టీ ఎవరివైపు మొ గ్గుచూపుతుందన్న విషయం తేలడం లేదు. తాజా గా దరఖాస్తుల స్వీకరణ చేపడుతుండటంతో మరింతమంది ఆశావహులు పెరిగే అవకాశముంది.
నిర్మల్‌లో ఒక్కరే..!
బీజేపీ గెలుస్తుందని బలంగా నమ్ముతున్న స్థానాల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాలున్నాయి. ఇందులో నిర్మల్‌పైనా పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇ క్కడ ఇప్పటికై తే మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఒక్కరే టికెట్ రేసులో ఉన్నారు. ఆయనకే పార్టీ టికెట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ పార్టీ దరఖాస్తుల స్వీకరణ చేపడుతోంది కనుక నిర్మల్ నుంచి మహేశ్వర్‌రెడ్డితో పాటు ఒకరిద్దరు నేతలు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
ముధోల్ నుంచి ముమ్మరంగా..
ముధోల్ నియోజకవర్గంలో ముందునుంచీ బీజేపీకి కొంత పట్టుంది. వరుసగా రెండు ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఈసారి గెలుస్తామన్న ధీమాలో ఉంది. ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ప్రజాసంగ్రామయాత్ర ఐదోవిడతను ముధోల్‌నుంచే ప్రారంభించారు.
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రామారావుపటేల్, నియోజకవర్గ సీనియర్ నేత మోహన్‌రావుపటేల్, ఎన్‌ఆర్‌ఐ, యువనేత బాజీరావు పటేల్, బద్ధం భోజారెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా ఇప్పటికే ప్రజల్లో ముమ్మరంగా తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. తమకే టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకోనున్నారు.
ఖానాపూర్‌లో పోటాపోటీ..
ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన ఖానాపూర్‌లో తొలిసారి బీజేపీ బలంగా కనిపిస్తోంది. ప్రజాసంగ్రామయాత్ర విజయవంతమైన తర్వాత ఇక్కడ మరింత ఆదరణ పెరిగినట్లు పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ పార్టీ ఇక్కడ గౌరవప్రదమైన ఓట్లు సాధించింది. వీటన్నింటి నేపథ్యంలో పలువురు సీనియర్లు, కొత్త నేతలు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ప్రధానంగా మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పెంబి జెడ్పీటీసీ సభ్యురాలు జానకీబాయి, సీనియర్ నేత హరినాయక్, గత ఎన్నికల్లో పోటీచేసిన సట్ల అశోక్‌తో పాటు మరో ఇద్దరుముగ్గురు గిరిజన నేతలు ఇక్కడి నుంచి దరఖాస్తు చేసుకోనున్నారు.
ఏ ప్రాతిపదికన కేటాయిస్తుందో..
కాంగ్రెస్ తరహాలో టికెట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న బీజేపీ ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేయనుందో వెల్లడించలేదు. నియోజకవర్గంలో బలాబలాలు, ప్రజాస్పందన, పార్టీనేతల రిపోర్టుల ఆధారంగా ఎంపికచేస్తారా... లేక ఇంకా ఏమైనా సర్వే రిపోర్టులు చూస్తారా.. తేల్చలేదు. మరోవైపు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరికి టికెట్ ఇస్తే.. మిగిలిన ఆశావహులు వారికి సహకరిస్తారా.. అనేదీ సందేహమే. ఇక పోటీ లేని నిర్మల్ లాంటి నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ఏంటన్న ప్రశ్నలూ సొంత పార్టీ నేతల నుంచే రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment