సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌

Published Tue, May 7 2024 12:40 AM

-

పారదర్శకంగా ఈవీఎంల

నిర్మల్‌చైన్‌గేట్‌: ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలి పా రు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజ కీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల ర్యాండమైజేషన్‌పై సోమవారం స మావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మొదటి, రెండో ర్యాండమైజేషన్‌, ఈ వీఎంల కమిషనింగ్‌ అనంతరం రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఎండలు అధికంగా ఉన్నందున ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలింగ్‌ కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, బెంచీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

నేడు 5కె రన్‌..

జిల్లాలో పోలింగ్‌ శాతం పెంచేలా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు స్వీప్‌ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకు 5కె రన్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇందులో అన్నివర్గాల ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌ సమీపంలోని ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ను కలెక్టర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. గోదాంలోని ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంల సెగ్రిగేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, నిర్మల్‌, ముధోల్‌, ఉట్నూర్‌ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, జివాకర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్‌రెడ్డి, రవి, సిరికొండ రమేశ్‌, గండ్రత్‌ రమేశ్‌, మజార్‌, హైదర్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్‌ సంగ్వాన్‌

Advertisement
Advertisement