పనుల్లో నాణ్యత పాటించాలి
నిర్మల్‌చైన్‌గేట్: నాణ్యతా ప్రమాణాలతో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులను జూన్ 5లోపు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సదుపాయం, ప్రహరీ రిపేర్లు, విద్యుత్ పనులు, స్లాబ్‌ల మరమ్మతు, గ్రిల్స్ ఏర్పాటు, పెయింటింగ్స్ తదితర పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పనుల ప్రారంభానికి ముందు, తర్వాత ఫొటోలతో కూడిన నివేదికలు అందించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోపు పనుల పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలల్లో చేపట్టిన పనులు, మరమ్మతుకు సంబంధించిన వివరాలు మండలాల వారీగా సమీక్షించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.
వెదురుబుట్ట అందజేత
పెంబి మండలం కొలంగూడ, పసుపుల గ్రామపంచాయతీలకు చెందిన గిరిజనులు చేతితో అల్లిన వెదురుబుట్టను నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రతినిధి నవీన్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు ఆయన ఛాంబర్‌లో అందజేశారు. ఈ సందర్భంగా పెంబి మండలంలో నీతి ఆయోగ్ ఎంపిక చేసిన బ్లాక్‌లలో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి పురోగతిని కలెక్టర్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment