23,10,190 | - | Sakshi
Sakshi News home page

23,10,190

Published Thu, Oct 31 2024 12:49 AM | Last Updated on Thu, Oct 31 2024 12:49 AM

-

● పెరిగిన ఓటర్ల సంఖ్య 91,027 ● అప్పుడు.. ఇప్పుడు మహిళా ఓటర్లే అధికం ● ముసాయిదా ఓటరు జాబితా విడుదల

మంచిర్యాలడెస్క్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటు నమోదుపై అవగాహన, ఎన్నికల సంఘం, అధికారులు చేపట్టిన కార్యక్రమాలతో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం మంగళవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటరు ముసాయిదా జాబితా–2024ను విడుదల చేసింది. పది నియోజకవర్గాల్లో మొత్తం 23,10,190మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 11,31,150 మంది పురుష ఓటర్లు, 11,78,906 మంది మహిళా ఓటర్లు, 134 మంది ఇతరులు ఉన్నారు. 2023 ఎన్నికల సమయంలో ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్య 22,19,163 ఉంది. వీరిలో పురుష ఓటర్లు 10,93,381 మంది, మహిళలు 11,25,65మంది, ఇతరులు 126మంది ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటరు జాబితా.. ప్రస్తుత ఓటరు జాబితాను పోల్చి చూస్తే 91,027 మంది ఓటర్ల సంఖ్య పెరిగింది. అప్పుడు.. ఇప్పుడు మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉంది. ఇతర ఓటర్లలోనూ స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది.

మహిళలే అధికం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉంది. ప్రతీ ని యోజకవర్గంలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. 2023నాటి జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య 11,25,656 ఉండగా.. ముసాయిదా జాబితా ప్రకారం 11,78,906కు పెరిగింది. ఈ లెక్కన 53,250 మంది మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది.

ఇదీ ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement