● కవ్వాల్ టైగర్‌జోన్‌లో పక్షుల కిలకిలలు ● ఏటా శీతాకాలం
బ్లాక్ వింగ్‌డ్ కై ట్
క్రస్టర్డ్ సర్పెంట్
ఈగల్
300 రకాలకు పైగా పక్షులు
వన్యప్రాణులకు నిలయంగా మారిన కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం ఇప్పుడు పక్షులకు అవాసంగా మారుతోంది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు పక్షి జాతుల సంరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారించారు. బర్డ్స్ ఫెస్టివల్‌లో భాగంగా జన్నారం అడవులకు వచ్చిన పక్షి ప్రేమికులు పలు రకాల కొత్త పక్షులను గుర్తించారు. ఈ పక్షుల విశేషాలను అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంలో 300లకు పైగా పక్షి జాతులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 200 రకాల పక్షుల వివరాలను సేకరించారు.
కళ్లముందే అనేక పక్షి జాతులు..
జన్నారం అటవీ డివిజన్‌లో కొంగలు, ఉలీ నెక్‌డ్ స్పార్క్, పిచ్చుకలు, చిలుకలు, వడ్రంగి పిట్ట, చికుముకి పిట్ట, పాలపిట్ట, వల్చర్, అడవి పావురాలు, పిచ్చుకలు, గద్దలు, కింగ్‌ఫిషర్, కోకిల, గోరింకలు, గువ్వలు, బ్లాక్ నెక్‌డ్ పక్షులు ఇలా అనేక రకాల పక్షులు ఉన్నాయి. వీటితో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 50 రకాల పక్షుల జాతులను కవ్వాల్ టైగర్‌జోన్‌లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
పక్షులను గుర్తిస్తున్నాం
ప్రతీ సంవత్సరం వలస పక్షులు వస్తుంటాయి. తిరిగి వెళ్తుంటాయి.ఏటా పక్షులను గుర్తిస్తాం. ఈ సంవత్సరం పక్షుల వలసలు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు తిరిగి ఫిబ్రవరిలో వెళ్తాయి. ఉన్నతాఽ దికారుల ఆదేశాల ప్రకారం టైగర్‌జోన్ వ్యా ప్తంగా వివిధ రకాల పక్షులను గుర్తిస్తున్నాం.
– జోగు ఎల్లం, ఎన్‌టీసీఎస్ సభ్యుడు
వలసలు ప్రారంభమయ్యాయి
కవ్వాల్ టైగర్‌జోన్‌లోని ప్రాంతాలకు వివిధ దేశాల నుంచి పక్షులు వలసలు వస్తుంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంతతి పెంచుకుని తిరిగి వెళ్తాయి. ఈ సంవత్సరం చలి తక్కువగా ఉన్నందున ఇప్పుడే వలసలు ప్రారంభమయ్యాయి. నవంబర్ మొదటి వారం వరకు అన్ని రకాల పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. పక్షుల రక్షణ కోసం అటవీశాఖ కృషి చేస్తుంది. – శివ్ ఆశిష్ సింగ్,
జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల
మొదలైన వలసలు..
ప్రతీ సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా పక్షుల వలసలు ప్రారంభమయ్యాయి. ఏటా అక్టోబర్ చివరి వారం నుంచి జనవరి వరకు వివిధ దేశాల నుంచి పక్షులు వచ్చి సంతతిని పెంచుకుంటాయి. అడవిలో నీటి ఆవాసాలు, గడ్డి క్షేత్రాలు ఉండటం వల్ల పక్షులు పెద్ద సంఖ్యలో వలస వస్తున్నాయి. జన్నారం డివిజన్‌లో బైసన్‌కుంట, మైస మ్మ కుంట, ఘనిషెట్టి కుంట, కల్పకుంట, ఉట్నుర్ డివిజన్ ఉడుంపూర్ గాదం చెరువు, కడెం ప్రాజెక్టు, కాగజ్‌నగర్ ప్రాంతాలలో ఆవా సాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
స్మాల్ మిల్వెట్
ఇండియన్
కోర్మోరెంట్
Comments
Please login to add a commentAdd a comment