No Headline
ఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) గ్రా మంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి రైతుల వరి ధాన్యం తడిసిపోయింది. గ్రామంలో పక్షం రోజుల క్రితం వరి కోతలు ప్రారంభించినా నేటికీ కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదని రైతులు వాపోయారు. వెంటనే ప్రారంభించాలని కోరారు.
కడెం మండలంలో..
కడెం: మండలంలోని కడెం, కొండుకూర్, పాండ్వపూర్, మద్దిపడగ తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచింది. దీంతో కొంత మేర రైతుల ధాన్యం తడిసింది. ప్రభుత్వం టార్పాలిన్లు అందించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.
కుంటాల మండలంలో..
కుంటాల: మండలంలోని కల్లూర్ అందాపూర్, ఓ లా, కుంటాల, పెంచికల్‌పాడ్, అంబకంటి, సూ ర్యాపూర్, లింబా(కే), లింబా(బీ) తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. అందాకూర్‌లో ఆరబోసిన మక్కలు తడిసి రంగు మారాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
నర్సాపూర్(జీ) మండలంలో..
నర్సాపూర్ (జి): మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. ఎంపీపీ కొండ్ర రేఖ రమేశ్ బంగ్లాపై ఉన్న హోర్డింగ్ కింద పడింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ అంతరాయమేర్పడి జనాలు ఇబ్బంది పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment