పెద్దపులి కోసం గాలింపు
నర్సాపూర్(జి): మండలంలోని అంజనీ తాండ అటవీ ప్రాంతంలో ఆదివారం అధికారులు పెద్దపులికోసం గాలింపు చేపట్టారు. మూడు బృందాలుగా విడిపోయి నర్సాపూర్(జి)నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుని చెరువు, కుస్లి, తిమ్మాపూర్(జి), దిలావర్ పూర్ మండలంలోని కదిలి అటవీ ప్రాంతాల్లో గాలించారు. కానీ ఎక్కడా పులి ఆనవాళ్లు లభించలేదు. పశువులు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులికి ప్రమాదం కలిగేలా ఎలాంటి ఉచ్చులు, విద్యు త్ తీగలు అమర్చినట్టు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో రామకృష్ణ, ఫ్లయింగ్ స్క్వాడ్ అనిత, డీఆర్వో నజీర్ఖాన్, ఎఫ్ఎస్వో అలేఖ్య, ఎఫ్ బీవో సాయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment