ముధోల్: మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం నుంచి ఈ నెల 14 వరకు పదవ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నిరంజన్ తెలిపారు. ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వా రు మాట్లాడుతూ అండర్–14, 17, 19 స్థాయిల్లో వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారం, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, టెన్నికై డ్స్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ దిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగి త్యాల జిల్లాల్లోని 12 సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల నుంచి సుమారు 1,020 మంది పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. క్రీడల నిర్వహణకు ఐదుగురు పీడీలు, 18 మంది పీఈటీలు, 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఇందుకు 17 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరుకానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment