సమగ్ర సర్వే పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర సర్వే పక్కాగా చేపట్టాలి

Published Wed, Nov 13 2024 1:02 AM | Last Updated on Wed, Nov 13 2024 1:02 AM

సమగ్ర సర్వే పక్కాగా చేపట్టాలి

సమగ్ర సర్వే పక్కాగా చేపట్టాలి

నిర్మల్‌చైన్‌గేట్‌/లక్ష్మణచాంద: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను పటిష్టంగా చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సూచించారు. నిర్మల్‌ పట్టణంలోని ఏఎన్‌.రెడ్డి కాలనీ, రాంనగర్‌లో, లక్ష్మణచాంద మండలం పీచర గ్రామంలో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే కోసం హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియలో భాగంగా ఇళ్లకు అంటించిన స్టిక్కర్లపై నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. సర్వే ఫారంలోని ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత నమూనాలో సమాచారం సేకరిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. ప్రతీ కుటుంబంలోని ఒక్కో వ్యక్తి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ఇప్పటివరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయింది.. కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఏ చిన్న తప్పిదానికి తావులేకుండా నిర్ణీత కోడ్‌లను పొందుపరుస్తూ స్పష్టమైన సమాచారంతో సర్వే వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతీ ఎన్యూమరేటర్‌ రోజుకు సగటున కనీసం 15 ఇళ్లను సర్వే చేయాలని సూచించారు. ఎన్యూమరేటర్లకు సలహా లు, సూచనలు ఇస్తూ, సర్వే ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని సూపర్‌వైజర్లను ఆదేశించా రు. ప్రతీ ఎన్యుమరేటరు సమయానికి నిర్దేశించిన ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లో సర్వే చేపట్టాలన్నారు. సర్వే నిర్వహించే కుటుంబాల సభ్యులు ఎవరైనా అందుబాటులో లేకుంటే వారి గుర్తింపు పత్రాల ఆధారంగా వివరాలు నమోదు చేయాలన్నారు. లక్ష్మణచాంద మండలంలో మొత్తం 1,0308 గృహాలకు, ఇప్పటివరకు 1,558 గృహాల సర్వే పూర్తయిందని ఎంపీడీవో రాధ ప్రత్యేక అధికారికి తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, మెప్మా పీడీ సుభాష్‌, తహసీల్దార్‌ రాజు, అధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement