రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
నిర్మల్‌టౌన్/తానూర్: రోడ్డు భద్రత నియమాలను అందరూ పాటించాలని ఎంవీఐలు ముర్తూజ అలీ, ధూప్‌సింగ్ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ముర్తూజ అలీ అవగాహన కల్పించారు. ధూప్‌సింగ్ బెల్‌తరోడ ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులకు పువ్వులు అందించి రోడ్డు భద్రత నిబంధనలు తెలియజేశారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపడం, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, అతివేగం అత్యంత ప్రమాదకరమని వివరించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడొద్దని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో రవాణాశాఖ సిబ్బంది తేజరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment