11 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నిర్మల్ రూరల్: టైలరింగ్, డ్రాయింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు జనవరి 11 నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో పి.రామారావు తెలిపారు. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలలో జరుగుతాయని వివరించారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు 11, 12, 16, 17 తేదీలలో ఉదయం, మధ్యాహ్నం ఉంటాయన్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ పరీక్షలు ఈ నెల 11వ తేదీన(ఒక రోజు) ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలు నిర్వహిస్తామన్నారు. హయ్యర్ పరీక్షలు ఈనెల 12వ తేదీ ఉదయం, మధ్యాహ్నం, 16వ తేదీ ఉదయం జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment