జిల్లాను ముందంజలో నిలుపుదాం
నిర్మల్..అంటే నిన్నమొన్నటిది కాదు. ఈ నేలకు వందలఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. నిర్మల్‌ను మరోఎత్తుకు తీసుకెళ్లేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ కొత్తఏడాదిలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ‘నిర్మల్ ఉత్సవాలు’ పేరిట వేడుకలు నిర్వహించేలా జిల్లాలో ఓ కొత్తట్రెండ్‌ను ప్రారంభిస్తున్నారు.
– వివరాలు
8లోu
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: నూతన సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. అన్నిరంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులు, పలు కార్యాలయాల సిబ్బంది గురువారం కలెక్టర్‌ను కలిసి పూలమొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, కార్యాలయాల సిబ్బందితో కలిసి కేక్‌కట్ చేశారు. అధికారులు నూతన సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ, జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాను సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన వారందరూ నోట్ బుక్కులు తీసుకురాగా, కలెక్టర్ వాటిని వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
టీఎన్జీవోస్ శుభాకాంక్షలు..
నూతన సంవత్సరం పురస్కరించుకొని టీఎన్జీవోస్ ప్రతినిధులు కలెక్టర్ అభిలాష అభినవ్‌ను గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌కు నోటు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు వెలమల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కూడాల రవికుమార్, ఏఈవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండపెల్లి అశోక్‌కుమార్, హెచ్‌డబ్ల్యూవో జిల్లా అధ్యక్షుడు బోనిగిరి సుజయ్, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు బి.రవి, సంతోష్, మోహన్‌రెడ్డి, రవిరాజ్, సుధాకర్, నర్సయ్య, శ్రీకాంత్, కిష్టారెడ్డి, రమణ, రాఘవేంద్ర, శ్రీవాణి, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
రైతులకు జారీ చేసిన నోటీసులు
కలెక్టర్‌ను కలిసిన ఏఎస్పీ
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ సబ్‌డివిజన్ నూతన ఏఎస్పీగా నియమితులైన రాజేశ్‌మీనా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలెక్టర్ చాంబర్‌లో గు రువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూ లమొక్క అందించి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా స్థితిగతులపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment