అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. అయి తే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల పూర్తిస్థాయి అమలుపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించి సర్కారును ఇ రుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరి ణామాలతో పార్టీ కేడర్‌లోనూ జోష్ తగ్గి కాస్తా నిరుత్సాహం ఆవరించింది. పైగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో అధికార పార్టీ ఎమ్మెల్యే వె డ్మ బొజ్జు పటేల్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. మి గతా ఆరు నియోజకవర్గాల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో తమ సమస్యలను ఆలకించే వారులేరనే ఆవేదన కేడర్‌లో వ్య క్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న శ్రేణులో జోష్ నింపి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు త్వరలో అందించనున్న రైతు భరో సా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు వంటి వాటి ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎన్నికలకు సంసిద్ధులను చేసేలా పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మావల మండల కేంద్రంలోని పద్మనా యక గార్డెన్లో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించనున్న సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ ముఖ్య అతిథులుగా హాజరుకా నున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో రా నున్న స్థానిక సంస్థలతో పాటు త్వరలో జరగను న్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎలాంటి కార్యాచరణ అనుసరించాలనే దానిపై సదరు నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తొలి సమావేశం కావడంతో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు దీన్ని సవాలుగా తీసుకుని పెద్ద ఎత్తున కేడర్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసమీకరణ ద్వారా తమ సత్తా చాటాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment