ఆదివాసీ గ్రామాల్లో కులదేవత ఉత్సవాలు
ఇంద్రవెల్లి(ఖానాపూర్): పుష్యమాసాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో జంగుబాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నెలవంకకు మొక్కిన కొలాం ఆదివా సీలు వారం రోజుల పాటు తమ వంశీయులు ఉన్న గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పెర్సపేన్(పెద్దదేవుడు), జంగుబాయి దేవతలున్న గ్రామాలకు వెళ్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం పాటగూడ కొలాం ఆదివాసీలు (కుమ్ర వంశీయులు) జంగుబాయి దేవత ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సంప్రదాయ వాయిద్యాలతో పుణ్య(గంగా)స్నానం కోసం కెరమెరి మండలంలోని జంగుబాయి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి గ్రా మానికి చేరుకుని జంగుబాయికి మహా పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగుబాయి పూజారి కుమ్ర బాపురావ్, గ్రా మ పెద్దలు కొడప లక్ష్మణ్, కుమ్ర రాజు, టేకం లేత, కుమ్ర రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment