కలప పట్టివేత
ఇచ్చోడ: మండలంలోని గుండాలలో మంగళవారం దాచి ఉంచిన కలపను పట్టుకున్న ట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు గుండాలలో తనిఖీలు నిర్వహించగా రంజా న్ అనే వ్యక్తి ఇంట్లో దాచి ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలప విలువ రూ.6,400 ఉంటుందన్నారు.
జన్నారం: ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న కలపను మాటు వేసి పట్టుకున్నట్లు ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ తెలిపారు. నాలుగు రోజులుగా కలప తరలించడానికి యత్నిస్తున్నారనే సమాచారం మేరకు రేంజ్ అధికారి సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సోమవారం రాత్రి ముచ్చినేని రాజు టేకు దుంగను బైక్‌కు కట్టుకుని వస్తుండగా పట్టుకున్నారు. బైక్‌తో పాటు కలప దుంగను సీజ్ చేసి రేంజ్ కా ర్యాలయానికి తరలించామని తెలిపారు. అతను ఇ చ్చిన సమాచారం మేరకు లాకవత్ ఉపేందర్, లాకవత్ రాజు, గవ్వల మురళి, రాజుపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పట్టుకున్న కలప విలువ రూ. 29,134 ఉంటుందన్నారు.
జాతీయస్థాయి శిక్షణకు ఎంపిక
భైంసాటౌన్: జాతీయ విద్యావిధానంపై ఢిల్లీలో జరిగే శిక్షణకు భైంసా పట్టణానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు నవీన్‌కుమార్ ఎంపికయ్యారు. లోకేశ్వరం మండలం మన్మద్ జెడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న నవీన్‌కుమార్ ఈనెల 8 నుంచి 28 వరకు జరిగే శిక్షణకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్టం నుంచి పదిమందిని ఎంపిక చేయగా జిల్లా నుంచి నవీన్‌కుమార్ ఉన్నారు.
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా
బెల్లంపల్లి: హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన తెలంగాణ స్టేట్ 11వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లికి చెందిన హెడ్ కానిస్టేబుల్ పూదరి సమ్మయ్య సత్తా చాటాడు. 50 సంవత్సరాల విభాగంలో జరిగిన హైమర్‌త్రో పోటీల్లో ప్రథమ బహుమతి, డిస్కస్‌త్రో పోటీల్లో తృతీయ బహుమతి గెలుచుకున్నాడు. మంగళవారం రామగుండం పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అడ్మిన్ ఏసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ సుందరరావు, కమిషనరేట్ ఎంటీవో సంపత్‌కుమార్ అభినందించి రివార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment