‘మరింత చేరువలో పోలీస్ సేవలు’
భైంసాటౌన్: నూతన ఏడాదిలో జిల్లా ప్రజలకు పో లీస్ సేవలు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీ సుకుంటున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ప ట్టణంలోని పాత రూరల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోని ఎస్పీ ట్రాన్సిట్ క్యాంప్ కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు. ఏఎ స్పీ అవినాష్‌కుమార్‌తో కలిసి డివిజన్ పరిధిలోని పలువురి నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్సైలు, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి సమ స్య స్థితిని తెలుసుకుని పరిష్కారానికి సూచనలు చే శారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నిర్మల్ పో లీస్.. మీ పోలీస్’లో భాగంగా ఇకపై ప్రతీ బుధవా రం తాను భైంసాలోని క్యాంప్ కార్యాలయంలో ఉద యం 11గంటల నుంచి అందుబాటులో ఉంటానని తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు నిర్భయంగా, స్వచ్ఛందంగా సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కాగా, గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్పీ ప్రజల వద్దకే వచ్చి ఫిర్యాదులు స్వీకరించడంపై ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేశారు.
పోస్టర్ ఆవిష్కరణ
భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఇంపాక్ట్ ప్రోగ్రాం పోస్టర్‌ను ఎస్సీ జానకీ షర్మిల ఆ విష్కరించారు. ఏఎస్పీ అవినాష్‌కుమార్, ఆనంది ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్, సీఐలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment