మహిళా సాధికారతే లక్ష్యం
నిర్మల్‌చైన్‌గేట్: మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాని యా, గ్రామీణాభివద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లో కేశ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్‌కో సీఎ ండీ కష్ణ భాస్కర్‌తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియపై ప్రగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మినీ ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటుకు స్థల సేకరణపై దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీటీడబ్ల్యూవో అంబాజీ, అధికారులు పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్లకు స్థలాలు గుర్తించాలి
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అన్ని మండలాల్లో ప్రస్తుత విద్యుత్ ఉప కేంద్రాలకు సమీపంలోని ప్రభుత్వ భూములు, వినియోగానికి వీలుకాని భూములను గుర్తించి నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఏడీ ల్యాండ్ సర్వేయర్ సుదర్శన్, గిరిజనాభివృద్ధి అధికారి అంబాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment