‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ముధోల్: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని డీఈవో రామారావు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించి, అభిప్రాయాలను తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని పేర్కొన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. బడికి రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లా డి బడికి వచ్చేలా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి రాజేశ్వర్, లింబాద్రి ఉన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
నర్సాపూర్ (జి): పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈవో రామారావు ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల తీరును పరిశీలించారు. స్కూల్ అసెంబ్లీలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు ఒత్తిడి లేకుండా సంసిద్ధులు కావాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకుని వారు చదువుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో కిషన్‌రావు, ఎస్‌వో రాజేశ్వర్, ఏఎస్సీ లింబాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment