జాతీయ సదస్సులో జిల్లా వైద్యులు
నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిర్వహించిన జాతీయస్థాయి చిన్నపిల్లల వైద్య నిపుణుల సదస్సులో నిర్మల్ వైద్యులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో చిన్న పిల్లల వైద్య నిపుణులుగా సేవలందిస్తున్నడాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ సుధీర్‌కుమార్ పా ల్గొని చిన్నారుల్లో తలెత్తుతున్న ప్రాణాంతక వ్యాధులు, అనారోగ్య సమస్యలుపై పరిశోధనాత్మక చర్చల్లో పాలుపంచుకున్నారు. హై టెక్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ జాతీయ సదస్సులో బృంద చర్చలు, ప్యానెల్ డిస్కషన్‌లో తమ అభిప్రాయాలను నివేదించారు. ‘ప్రాణాంతక వ్యాధులు, ప్రకృతి ప్రమాదాలను ఎదుర్కొనుటలో సన్నద్ధత’ అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరగగా ఇందులో వీరు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు, యాంటీ బయాటిక్స్ వినియోగం తదితర అంశాలపై చర్చ జరిగిన ట్లు వెల్లడించారు. ఇందులో ప్రధానవక్తలుగా ప్రొఫెసర్లు డాక్టర్ రాజేంద్రన్, డాక్టర్ మహేశ్ మోహితే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment