నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఓ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట బాధితులు గురువారం ఆందోళన చేశారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి గల్ఫ్ వెళ్లడానికి జిల్లా కేంద్రంలోని ఓ ట్రావెల్స్ ఏజెంట్‌ను ఆశ్రయించాడు. ట్రావెల్స్ ప్రతినిధులు దుబాయ్‌లో సూపర్ మా ర్కెట్లో మంచి జీతంతో.. ఉద్యోగం ఉందని తెలిపా రు. అందుకు రూ.1.70 లక్షలు చెల్లించాని చెప్పారు. అందుకు అంగీకరించిన వ్యక్తి అడిగిన డబ్బులు చె ల్లించాడు. దీంతో ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులు అతడి ని గల్ఫ్ పంపించారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం కాకుండా వేరే పని చేయిస్తున్నారు. బాధితుడు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వచ్చి యజమానిని నిలదీశారు. ఈ క్రమంలో ఆ యజమాని బాధితులపై దాడి చేశాడు.
● కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment