మద్దతు ధరలకు చట్టం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వం పంటకు సంబంధించిన మద్దతు ధరలకు చట్టం చేయాలని అఖిల భారత ఐక్య రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నంది రామయ్య అన్నారు. ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు రైతులతో ర్యాలీ నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ మోదీ పాలనలో పెట్టుబడిదారులు, ధనవంతుల చేతుల్లోనే దేశ సంపద కేంద్రీకృతమై ఉంటే మరో పక్క 45 శాతం గ్రామీణ ప్రజలు, 56 శాతం గ్రామీణ మహిళలకు రోజుకు రెండు పూటలకు మించి ఆహారం అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పూర్తిస్థాయిలో రైతుల రుణమాఫీ అమలు చేయాలని, చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న, పార్టీ జిల్లా నాయకులు రామలక్ష్మణ్, అఖిల భారత రైతు ఐక్య సంఘం జిల్లా నాయకులు అంకుశ్‌రావు, రాజ న్న, కుంచపు ఎల్లయ్య, శంకర్, వర్మ, కుర్మ రాజన్న, భీమ్‌రావ్, మధు, సోనేరావ్, చందు పాల్గొన్నారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రామయ్య
Comments
Please login to add a commentAdd a comment