ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలి

Published Fri, Jan 10 2025 1:21 AM | Last Updated on Fri, Jan 10 2025 1:21 AM

ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలి

ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలి

● ధరణి పెండింగ్‌ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి ● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరి ష్కారం, రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా ఇసుక అందుబాటులో ఉన్న నది, వాగులను గుర్తించాలని సూచించారు. రహదారులు, భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు రికార్డులను పరిశీలించి ఇసుక అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు, వాణిజ్య తదితర వాటికి రుసుం చెల్లించిన వారికే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలన్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగకుండా గుర్తించిన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రధాన రహదారులపై తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నా రు. మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, తహసీల్దార్లు సమన్వయంతో పని చేయాలన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలను గుర్తించి సీజ్‌ చేయాలని, భారీ జరి మానాలు విధించడంతోపాటు సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు శాఖల అధికారులు ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని సూచించారు. ధరణి పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, జిల్లాలో మొత్తం 1,665 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలలో ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా చర్చించి త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, దేవాదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర భూ ముల వివరాలు సర్వే నంబర్ల వారీగా రికార్డులను సిద్ధం చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించిన రిపోర్టులను అందజేయాలన్నారు. మండలాల వారీగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవోలు రత్నాకళ్యాణి, కోమల్‌రెడ్డి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ ఏడీ సుదర్శన్‌, ఈడీఎం నదీమ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement