నైపుణ్యం సాధిస్తేనే స్వయం ఉపాధి
భైంసాటౌన్: విద్యార్థులు వృత్తివిద్యలో నైపుణ్యం సాధిస్తేనే స్వయం ఉపాధి అవకాశాలుంటాయని డీఐఈవో పరశురాం పేర్కొన్నారు. బుధవారం పట్ట ణంలోని గురుకృపా వొకేషనల్ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వి ద్యార్థులతో మాట్లాడారు. వృత్తివిద్య కోర్సులతో వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పేర్కొ న్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. ఆయన వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణగౌడ్, ప్రిన్సిపాల్ సాయినాథ్, అధ్యాపకులు నరేశ్‌గౌడ్, హరిత, శ్రీదేవి, మనీషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment