‘ఆధ్యాత్మికతతో అంతా శుభమే..’
నిర్మల్: నిత్యజీవితంలో ఆధ్యాత్మికతను అలవర్చుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, అంతా శుభమే జరుగుతుందని షిరిడీకి చెందిన వికాస్‌మహరాజ్ అన్నారు. సాయిదీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వారంపాటు కొనసాగిన సాయి మహాపారాయణం ముగిసింది. ముగింపు ఉత్సవంలో భాగంగా బుధవారం ఉదయం పారాయణం చేసి, పట్టణ ప్రధాన వీధులలో సాయి పల్లకి ఊరేగించారు. కాలనీల్లో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో షిరిడీ నుంచి తీసుకువచ్చిన పాదుకలను దర్శించుకున్న తర్వాత మధ్యాహ్న హారతి నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సాయిదీక్ష సేవాసమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి, సభ్యులు రాంరెడ్డి, జైపాల్‌రెడ్డి, నందు, పండరి, కృష్ణ, శ్రీనివాస్, కోల శంకర్, రేఖ, రమ, జొన్నల మనోహర్, మహేందర్ యాదవ్, నారాయణరెడ్డి, తిరుపతి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment