జీవనభృతి అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: బీడీ కార్మికులకు షరతులు లే కుండా రూ.4,016 జీవన భృతి ఇవ్వాలని తె లంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎ ల్‌టీయూ రాష్ట అధ్యకుడు ఎస్ సిద్దిరాములు కోరారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం, బీఎల్‌టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మహాలక్ష్మి కార్యాలయం నుంచి బీడీ కార్మికులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిరాములు మాట్లాడుతూ.. జీవనభృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీశ్, జిల్లా కన్వీనర్ పోసాని, బీఎల్‌టీయూ నాయకులు మహమూద్, అరుణ, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం నాయకురాలు కళావతి, గల్ఫ్‌కార్మిక, ప్రవాస భారతీయ సంఘం నాయకుడు వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment