దొంగనోట్ల కలకలం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో బుధవారం దొంగనోట్లు కలకలం సృష్టించాయి. స్థానిక గాంధీ కూరగాయల మార్కెట్‌లో వృద్ధుడు కూరగా యలు, నువ్వులు విక్రయిస్తున్నాడు. ఆ వృద్ధుడి వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి రూ.200 నోట్లు రెండిచ్చి నువ్వులు కొనుగోలు చేసి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న మరో వ్యక్తి గమనించి అవి నకలీ నోట్లుగా గుర్తించాడు.
నూతన నియామకం
కడెం: కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా మండల కేంద్రానికి చెందిన చొప్పదండి దుర్గభవాని నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఇటీవల నియమాక జాబితా విడుదల చేశారు. గత రెండు పర్యాయలు అధ్యక్షురాలిగా పనిచేసిన దుర్గభవాని మూడోసారీ పదవి చేపట్టనున్నారు. తన నియామకానికి కృషి చేసిన ఇన్‌చార్జి మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు దుర్గాభవాని కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర మ హిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నిర్మల్ పట్టణాని కి చెందిన అల్లూరి కృష్ణవేణిని నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబకు, ఇతర నాయకులకు ఈ సందర్భంగా కృష్ణవేణి కతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment