వన్యప్రాణుల వేటగాళ్ల పట్టివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండల పరిధిలోని అటవీ శివారు ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడే ముఠాను మంగళవారం పట్టుకున్నట్లు లక్సెట్టిపేట అటవీరేంజ్ అధికారి అత్తె సుభాష్ తెలిపారు. టీకానపల్లికి చెందిన జాడి రాజలింగు, ఇరగడ్డ సాగర్, బుద్దిపల్లికి చెందిన జాడి వినోద్, దుర్గం ప్రశాంత్, దుర్గం రాములు జాడి రాజలింగుకు చెందిన పత్తి చేనులో ఉన్న విద్యుత్ లైన్ ద్వారా సమీప అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులను వేటాడేందుకు రెండు కిలోమీటర్ల వరకు బైండింగ్ వైర్ వేశారు. ఈ నెల 3న అటవీ అధికారులు గమనించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని లక్సెట్టిపేట అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో నేరం అంగీకరించడంతో వైల్డ్‌లైఫ్ సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ మూడు రోజుల క్రితం వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న అధికారులు బేరసారాలు సాగిస్తున్నారని ముమ్ముర ప్రచారం జరగడంతో అప్రమత్తమై ఎట్టకేలకూ అరెస్ట్‌ను అధికారికంగా ప్రకటించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment