రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సోన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కె.గోపి తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌కు చెందిన మోరె తిరుపతి (49) సోమవారం మాదాపూర్ గ్రామ సమీపంలోని గోదావరినదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగివస్తుండగా సబ్‌స్టేషన్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు నిర్మల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని రాంపూ ర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రావణే రవి (37) మృతి చెందినట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ కాలనీకి చెందిన రవి పని నిమిత్తం మంగళవారం ద్విచక్ర వాహనంపై కోడద్ గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా మార్గమధ్యలో రాంపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీ కొట్టింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య వాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆటో బోల్తాపడి
మహిళ..
బజార్‌హత్నూర్(బోథ్): ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అప్పారావ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గిర్నూర్ గ్రామానికి చెందిన మెకెన్ గౌరుబాయి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దేగామ పోచమ్మ ఆలయానికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆటోలో గిర్నూర్‌కు వస్తుండగా దేగామ సమీపంలో మూలమలుపు వద్ద డ్రైవర్ రాకేష్ వేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో లింగంపెల్లి అడెళ్ళ(35) మృతి చెందగా తోషం రాజుబాయి, మైలారపు అరుణ్, అయిల ఆశన్నకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment