నిర్మల్‌రూరల్: ప్రధానోపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు నాకిడి బక్కన్న గత ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి సంబంధించిన పెండింగ్ బిల్లుల గురించి జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు నాకిడి ఆదిత్య మంగళవారం వెంగాపేట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గజ్జరం వద్దకు వెళ్లి ఆరా తీశాడు. ఆ స మయంలో కరెంటు లేకపోవడంతో బయట చేయించుకోమని హెచ్‌ఎం బదులిచ్చాడు. బయటకు వెళ్లి న ఆదిత్య తిరిగి మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లి తన తండ్రికి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఎందుకు చేయడం లేదని అతనితో గొడవపడి, కర్రతో గాయపరిచాడు. ప్రధానోపాధ్యాయుడు గజ్జరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదిత్యపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment