ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాస్తారోకో
బెల్లంపల్లి: సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. కన్నాలబస్తీ, టేకులబస్తీ, ఇతర బస్తీలలో నివాసం ఉంటున్న రిటైర్డు కార్మికులు రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ పురోభివృద్ధి కోసం రక్త మాంసాలను ధారపోసిన రిటైర్డు కార్మికులపై సింగరేణి యాజమాన్యం సానుభూతి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. చాలీచాలని పింఛన్ డ బ్బులతో జీవిత చరమాంకంలో ఎన్నోబాధలను అ నుభవిస్తున్నామన్నారు. తమకు కంపెనీ క్వార్టర్ త ప్ప మరో ఆధారం లేదన్నారు. ఈ విషయంలో కో ల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు అమానుల్లాఖాన్, కాంగ్రెస్ మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షుడు ఎండీ గౌస్, మాజీ ఎంపీపీ తొంగల మల్లేశ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పొట్ల సురేశ్, ఆకుల సత్యనారాయణ, రిటైర్డు కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment