బెజ్జూర్: పురుగుల మందు తాగి ఒకరు బలవన్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని అందుగులగూడకు చెందిన కోరేత ప్రకాశ్ (32)కు గబ్బాయి గ్రామానికి చెందిన లలితతో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి గబ్బాయిలోనే నివాసం ఉంటున్నాడు. దంపతులకు తొమ్మిదేళ్ల కూతురు ఉంది. భార్య ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఇంటివద్ద పెరట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా 108లో బెజ్జూర్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా ప్రకాశ్ మృతికి అతని భార్య కారణమని కుటుంబ సభ్యులు ఇచ్చి ఫిర్యాదు మేరకు లలితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
ల్యాండ్రీ షాపు దగ్ధం
ఆదిలాబాద్‌రూరల్: పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో గల దస్నాపూర్ కాలనీలో ల్యాండ్రిషాప్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధితుడు సాంటెన్న తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి 10.30 గంటల సమయంలో షాపులో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లగా అప్పటికే అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేశారన్నారు. ప్రమాదంలో షాపులో ఉన్న ఫ్యాన్, టేబుల్, కుర్చీలు, బట్టలు దగ్ధమయ్యాయని, వాటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. బాధితుడిని ఆర్థికంగా ఆదుకోవాలని సామాజిక వేత్త ముడుపు మౌనిష్ రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment