చైనా మాంజా వినియోగిస్తే చర్యలు తప్పవు
కాసిపేట(బెల్లంపల్లి): చైనామాంజాతో గాలిపటాలు ఎగురవేస్తే చర్యలు తప్పవని అటవీశాఖ డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ అన్నారు. మంగళవారం తెలంగాణ మోడల్ స్కూల్, ముత్యంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులకు అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఇది ప్లాస్టిక్ పదార్థంతో చేయడంతో గట్టిగా పదునుగా ఉంటుందని, ఆ దారానికి గాజుపొడి పూయడంతో పిల్లలు, మనుషులు, పక్షులు, అటవీ జంతువులను కోసుకుపోవడం వలన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర పర్యవరణ చట్టం 2016 ఉత్తర్వుల ప్రకారం చైనా మాంజాను నిషేధించినట్లు తెలిపారు. మాంజాను రవాణా చేసినా నిల్వ ఉంచినా గాలిపటాలు ఎగురవేసినా మూడు నుంచి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీవో శ్రీధర్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నాగమల్లయ్య, పుష్పలత, బండ శాంకరి, జ్యోతి, తిరుపతి, చెంద్రశేఖర్‌రెడ్డి, మాధవిలత, కృష్ణగోపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment