కరంజీలో పులి సంచారం
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జైనథ్ మండలంలోని కరంజి(కే)గ్రామంలో పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. పంట చేలకు వెళ్లిన రైతులు పులి పాదముద్రలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం అధికారులు ఆ గ్రామానికి చేరుకుని పాదముద్రలను గుర్తించి పులి కదలికలను నిర్ధారించారు. మహారాష్ట్రలోని పాండ్రకవడ డివిజన్ జామిని రేంజ్ నుంచి పెన్‌గంగ దాటి బేల రేంజ్‌లోకి వచ్చిందని, కరంజీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలో పోలీసులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం అన్వేశించారు. పులిని గుర్తించేందుకు ఒక్కో బృందంలో ఐదుగురు చొప్పున మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్‌సింగ్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. తప్పుడు పుకార్లు నమ్మవద్దని పాదముద్రలు గానీ, పులి కదలికలు కానీ గమనించినట్‌లైతే వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించాలని సూ చించారు. సూర్యాస్తమయం తర్వాత పంటచేలో ఉండవద్దని, ఒంటరిగా చేలకు వెళ్లవద్దని సూచించారు. పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు చప్పుడు చేసుకుంటూ గుంపులుగా వెళ్లాలన్నారు. జైనథ్ సీఐ సాయినాథ్‌తో పాటు ఏఎస్‌ఐ ఆత్మారాం, అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు నాగోరావు, రాజేందర్, ఆర్.గులాబ్‌సింగ్, మనోరంజనీ, ప్రవీణ్, సంతోష్, సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు
మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు
పరిసర గ్రామాల్లో భయాందోళన
Comments
Please login to add a commentAdd a comment