రేపటి నుంచి ఫుట్‌బాల్ పోటీలు
రామకష్ణాపూర్(చెన్నూర్): పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9 నుంచి తెలంగాణ స్థాయి(సౌత్‌జోన్)అండర్–13 బాలికల ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. ఖేలో ఇండియా పోటీలలో భాగంగా ఐదు రోజులపాటు లీగ్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ పోటీల్లో మొత్తం ఏడు జిల్లాల జట్లు పాల్గొననున్నట్లు ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్‌రెడ్డి తెలిపారు. పోటీల నిర్వహణకు సింగరేణి యాజమాన్యంతో పాటు క్యాతనపల్లి ము న్సిపాలిటీ పాలకవర్గం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను మంగళవారం మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఏఈ అచ్యుత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రాజు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment