‘స్థానిక’ంపై ఫోకస్
● ఆదిలాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం ● నేడు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం ● హాజరుకానున్న పీసీసీ చీ్‌ఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేడర్‌ను సన్నద్ధం చేసే దిశగా దృష్టి సారించింది. ఎన్నికల్లో విజయానికి ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తున్న హస్తం పార్టీ.. ‘స్థానిక’ సమరానికి సైతం జిల్లా నుంచే సమరశంఖం పూరించాలని సంకల్పించింది. సోమవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి అతిథులుగా హాజరై ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో రాజకీయంగా ఎన్నికల వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది.
సెంటిమెంట్ ఆనవాయితీగా..
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వేదికగా దళిత, గిరిజన దండోరా పేరిట ఎ న్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయ ఢంకా మోగించి అధికారం చేపట్టింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా రేవంత్ రెడ్డి ఇదే ఆనవాయితీ కొనసాగించారు. తొలుత ఇంద్రవెల్లిలోనే పర్యటించారు. తాజాగా స్థానిక సంస్థల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెలా ఖరు లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఆ తర్వాత మండల, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఈ ఎన్నికల
న్నింటిలోనూ సత్తా చాటాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకు కేడర్‌ను పూర్తిస్థాయిలో సంసిద్ధులను చేసే దిశగా కార్యాచరణ రూపొందించింది. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షలను నిర్వహించాలని భావించిన హైకమాండ్ ఆదిలాబాద్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం.
Comments
Please login to add a commentAdd a comment