● జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కలెక్టర్ అభిలాష అభ
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా చరిత్ర, సంస్కృతి, వంటకాలను నేటితరానికి గుర్తుచేయాలన్న ఉద్దేశంతో ‘నిర్మల్ ఉత్సవాలు’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ చరిత్రను కళ్లకు కట్టించేలా వివరించారు. విద్యార్థినులు సోది రూపంలోనూ నిర్మల్ సంస్కృతి, చరిత్రను చెప్పి ఆకట్టుకున్నారు. జొన్నరొట్టే, పిట్లా, ఇప్పపువ్వు లడ్డు తదితర జిల్లా వంటకాలను చాలామంది టేస్ట్ చేశారు. మరో రెండురోజుల పాటు సాగే కార్యక్రమాలనూ విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
అలరించిన చిన్నారుల నృత్యాలు
నిర్మల్ ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు నిర్మల్ చరిత్రను తెలిసేలా నృత్యాలు పాటల రూపంలో ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా నృత్య కళ నాట్య అకాడమీ ఆధ్వర్యంలో శంభో శివ శంభో అనే పాట మీద క్లాసికల్ నృత్యం ప్రదర్శించారు. సారంగాపూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు డ్యాన్స్ ద్వారా జిల్లా చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించారు. సోన్ మండలం మాదాపూర్‌కు చెందిన గాయత్రి తబలా ద్వారా తన ప్రతిభను చాటారు. జెడ్పీహెచ్‌ఎస్ మంజులాపూర్‌కు చెందిన విద్యార్థినులు ‘బండిగట్టరో రామన్న’ అనే జానపద నృత్యం ప్రదర్శించారు. జామ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థినులు ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్ జరుగుతున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్కిట్ నిర్వహించారు.
ఆకట్టుకున్న స్టాల్స్
డీఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురాతన వంటకాలైన జొన్నరొట్టె పిట్ల, దమ్ బిర్యాని, ఇప్పపువ్వుతో చేసిన లడ్డూ, పల్లిపట్టీలపై ప్రజ లు ఆసక్తి కనబర్చారు. ఇవే కాకుండా స్థానిక వ్యాపార సముదాలు ఏర్పాటు చేసిన తినుబండారాలను పట్టణ ప్రజలు రుచి చూశారు.
జిల్లా చరిత్రను చాటేందుకే..
నిర్మల్ జిల్లా చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పాఠశాలల విద్యార్థులు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, మహిళా స్వయం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని వస్తువులను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంబంధిత అధికారులు కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నిర్మల్ మహోత్సవాల కార్యక్రమానికి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చా రు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.
రాజూర విద్యార్థుల బజ్జీల స్టాల్
లోకేశ్వరం: నిర్మల్ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని రాజూర ప్రభుత్వ ఉన్నత పాఠశా ల విద్యార్థులు బజ్జీల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేడి నూనెలో నుంచి చేతితో బజ్జీలు తీయడం అందరినీ ఆకట్టుకుంది. ఈకార్యక్రమంలో గైడ్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment