కడెం రైతాంగానికి అండగా ప్రభుత్వం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
● ఆయకట్టుకు నీటి విడుదల
కడెం: కడెం రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు కాలు వలకు యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.46 కోట్లు మంజూరు చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదన్నారు. ఈఈ రాథోడ్ విఠల్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 694.650(6.279టీఎంసీ)అడుగులు ఉందని, రైతులు యా సంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. వారబందీ(ఎనిమిది రోజులు నీటి విడుదల, 12 రోజులు నిలిపివేత) పద్ధతిలో ఏప్రిల్ 21 వరకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. 28వ డిస్ట్రిబ్యూటరీ వరకు సుమారు 15,050 ఎకరాలకు సాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శైలజ రమేశ్‌రావు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పి.సతీశ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మల్లేశ్, దుర్గాభవాని, భూషణ్, వెంకటేశ్, శంకర్, సలీం, రహీం, సత్యంచారి, శ్రీనివాస్, డీఈఈ నవీన్, ఏఈఈలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సదర్‌మాట్‌కు నీటి విడుదల
ఖానాపూర్: మేడంపల్లి పంచాయతీ పరిధిలోని సదర్మాట్ ఆయకట్టు రైతులకు ఆదివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేశారు. ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టు పరిధిలోని 13 వేల ఎకరాలకు యాసంగిలో అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ చిన్నం సత్యం, నాయకులు అమంద శ్రీనివాస్, గుగ్లావత్ రాజునాయక్, జంగిలి శంకర్, మాజిద్, నిమ్మల రమేశ్, యూసుఫ్‌ఖాన్, తోట సత్యం, షౌకత్‌పాషా, శేషాద్రి, నయిం, సంతోశ్, రఘుపతిరెడ్డి, పెద్దులు, లక్ష్మీపతిగౌడ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment