చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నిర్మల్‌టౌన్: భారత రాజ్యాంగంలో ప్రజలకు కల్పించబడిన హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి కర్ణ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులు, పెన్షనర్లకు కొన్ని చట్టాలను రూపొందించడం జరిగిందని, వృద్ధాప్యంలో నిరాధరణకు గురైతే న్యాయస్థానంలో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి రాధిక, ఏఎస్పీ ఉపేందర్‌రెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment