‘బీడీ కార్మికులకు 26 రోజులు పని కల్పించాలి’
నిర్మల్‌చైన్‌గేట్: శివాజీ బీడీ యాజమాన్యం బీడీ కార్మికులకు నెలలో 26 రోజులు పని కల్పించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూని యన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ బీడీ యాజమాన్యం కేవలం పది రోజులు రోజుకు సగం దినం పని మాత్రమే కల్పించడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నా రు. జిల్లాలో ఒకే బీడీ యజమాని రెండు రకాలుగా పని దినాలు ఇస్తుంటే కార్మికులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.బక్కన్న, ఉపాధ్యక్షుడు రామ లక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.గంగన్న, నాయకులు కే.లక్ష్మి, సుజాత, లావణ్య, సునీత, రమేశ్, గంగాధర్, గజ్జారాం, ముత్యం, సత్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment