పెరిగిన ఓటర్లు.. | - | Sakshi
Sakshi News home page

పెరిగిన ఓటర్లు..

Published Tue, Jan 7 2025 12:06 AM | Last Updated on Tue, Jan 7 2025 12:06 AM

పెరిగిన ఓటర్లు..

పెరిగిన ఓటర్లు..

● జిల్లాలో మొత్తం..7,47,608 మంది ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. 24,219 మంది ● కొత్త ఓటర్లలోనూ మహిళలే టాప్‌ ● యువకుల నమోదు అంతంతే

నిర్మల్‌: జిల్లాలో మొత్తం 7,47,608 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం సోమవారం తుదిజాబితాలో ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటర్ల జాబితాతో పోలిస్తే ఏడాదికాలంలో 24వేలకు పైగా కొత్తఓటర్లు పెరగడం గమనార్హం. మొత్తం ఓటర్ల లెక్కతో పాటు కొత్త ఓటర్ల నమోదులోనూ మహిళలే టాప్‌లో ఉన్నారు. వాళ్లతో పోలిస్తే యువకులు ఓటు నమోదులో వెనుకంజలో ఉండటం గమనార్హం.

మహిళలదే ఆధిక్యత..

అసెంబ్లీకి 2023 నవంబర్‌లో ఎన్నికలు జరుగగా, అప్పుడు జిల్లాలో 7,23,389 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా వెల్లడించిన ఓటర్ల ఫైనల్‌ జాబితాలో 7,47,608 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఈలెక్కన జిల్లాలో కొత్తగా 24,219 మంది ఓటర్లు పెరగడం గమనార్హం. ఏడాది క్రితం మహిళలు 3,72,829 మంది ఉండగా తాజాగా 3,87,227 మంది ఉన్నారు. ఈలెక్కన 14,398 మంది కొత్త మహిళా ఓటర్లు పెరిగారు. జనాభాలోనూ ఆధిక్యంలో ఉన్న మహిళలు ఓటరుగా నమోదులోనూ అదే వరుసలో నిలుస్తున్నారు. ఓటుహక్కు వినియోగంలో ముందుచూపు చాటుతున్నారు.

యువత వెనుకంజ..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పురుష ఓటర్లు 3,50,509 మంది ఉండగా తాజా ఫైనల్‌ జాబితాలో 3,59,393 మంది ఉన్నారు. ఈలెక్కన పురుష ఓటర్లు కేవలం 8,884 మంది మాత్రమే పెరిగారు. ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా ఎప్పుడూ సెల్‌ఫోన్‌లోనే జీవితం గడుపుతున్నా.. యువత కనీసం ఆన్‌లైన్‌ ద్వారా కూడా తమ ఓటును నమోదు చేసుకోకపోవడం శోచనీయం. ఇక గతేడాది 51 మంది ఇతరులు (థర్డ్‌జెండర్‌) ఉండగా, ఈసారి ఒక్కరే పెరిగారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో రాజకీయవర్గాలు ఓటర్ల జాబితాను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.

జిల్లా ఓటర్ల తుదిజాబితా వివరాలు

నియోజకవర్గం పోలింగ్‌ పురుషులు మహిళలు థర్డ్‌ జెండర్‌ సర్వీస్‌ మొత్తం

కేంద్రాలు ఓటర్లు

నిర్మల్‌ 306 1,23,088 1,37,730 21 248 2,61,087

ముధోల్‌ 311 1,25,148 1,32,948 17 293 2,58,406

ఖానాపూర్‌ 308 1,11,157 1,16,549 14 431 2,28,151

మొత్తం 3,59,393 3,87,227 52 972 7,47,608

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement