చరిత్ర చెబుదాం..
నిర్మల్
వీడని మర్డర్ మిస్టరీలు!
మంచిర్యాల జిల్లాలో జరిగిన కొన్ని హత్యలు మిస్టరీగా మిగిలిపోయాయి. మూడు హత్య కేసులు పోలీసులకు పెను సవాల్‌గా మారాయి.
మంగళవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
సామాన్యులకు అండగా పోలీసులు
నిర్మల్‌టౌన్: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ చరిత్రపై పరిశోధనలు జరిపి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా, శిశు, సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. సోమవారం రెండోరోజు నిర్మల్ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి పూలమొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నిర్మల్ ఉత్సవాల పేరిట వినూత్న కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్‌ను అభినందించారు. నిర్మల్ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయన్నారు. నిర్మల్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అందరి భాగస్వామ్యంతోనే..
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లా చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులను కలెక్టర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఎస్పీ జానకీ షర్మిల, అదనపు ఎస్పీలు అవినాష్, రాజేశ్ మీనా, ఉపేంద్రరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కనిపించని చరిత్ర..
నిర్మల్ ఉత్సవాల పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో రెండోరోజు కూడా నిర్మల్ చరిత్రకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. నిర్మల్ చరిత్ర తెలుసుకుందామని ఎంతో ఆశతో వచ్చిన పట్టణ, పరిసర గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది. కేవలం వివిధ శాఖల వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాళ్లు వీక్షించి, ఫుడ్ కోర్ట్ వంటకాలు రుచి చూశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి నిర్మల్ చరిత్రను వివరించారు.
న్యూస్‌రీల్
ముందుతరాలకు అందిద్దాం..
మన సంస్కృతిని కాపాడుకుందాం
నిర్మల్ ఉత్సవాలు భేష్..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై ప్రశంసలు
చరిత్ర చెప్పడం బాగుంది..
నిర్మల్ ఉత్సవాలు నిర్వహించడం ఒక ఎత్తయితే ఇక్కడ నిర్మల్ చరిత్రను ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా చెప్పడం బాగుంది.
– కూన రమేశ్, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment