భైంసాలో ఓపెన్‌జిమ్ మాయం..!
నూతన పార్క్‌లో జిమ్ ఏర్పాటు
ఖానాపూర్: పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌లోనే సు మారు రూ.5 లక్షల వరకు వెచ్చించి జిమ్ ఏ ర్పాటు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వహయాంలో పనులు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎ మ్మెల్యే వెడ్మ బొజ్జు చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పట్టణ వాసులతో జిమ్ కళకళలాడుతోంది.
భైంసాటౌన్: పట్టణాల్లో ప్రజలకు వ్యాయామం కోసం గత ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భైంసాలోని కుంట ప్రాంతంలో దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ బాధ్యతలు లేకపోవడంతో వాటిపై నిఘా కొరవడింది. ఫలితంగా ఓపెన్‌జిమ్‌లోని పరికరాలన్నీ చెడిపోగా కొన్ని అపహరణకు గురయ్యాయి. ప్రస్తుతం ఓపెన్‌జిమ్ ఆనవాళ్లు లేకుండా పోగా ఆ స్థలంలో షాదీఖానా మంజూరైంది. అది నిర్మాణ దశలో ఉండగా నిధులు లేక పనులు నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment