నిర్మల్
సరదా.. సరదాగా..!
జన్నారం అటవీ డివిజన్, చెన్నూర్ అటవీ రేంజ్ పరిధిలో ఆదివారం బర్డ్‌వాక్ సరదా సరదాగా గడిచింది. దూర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు హాజరయ్యారు.
9లోu
సోమవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
గజ్జలమ్మదేవికి పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తులు పూజలు నిర్వహించా రు. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్రలో ని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేష్ ఆధ్వర్యంలో అభిషేకం, అలంకరణ, అర్చన, హార తి, తాటి శివ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.
వ్యర్థాలతో బొమ్మలు
సోన్: నిర్మల్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్ 26లో ఆదివారం సోన్ మండలం కడ్తాల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వ్యర్థాలతో బొమ్మలు తయారుచేసి ప్ర దర్శించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌బాబు మాట్లాడుతూ అగ్గిపుల్లలతో ఇండ్లు, గాజు ముక్కలతో కోడి, రాళ్లతో మనుషులు, వ్యర్థ పదార్థాలతో నెమ లి, ఏనుగు, వివిధ రకాల జంతువులు, పక్షు ల బొమ్మలు తయారు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు సహాని, లావణ్య, అవంతిక, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment