పకడ్బందీగా నిర్మల్ ఉత్సవాలు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముధోల్ శాసనసభ్యులు రామారావు పటేల్‌తో కలిసి నిర్మల్ ఉత్సవాల్లో కార్యక్రమ నిర్వహణపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 5, 6, 7వ తేదీల్లో కార్యక్రమాలు జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్వహించాలన్నారు. అధికారులు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా చరిత్రను తెలియజేసేలా ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలను ఆకట్టుకునేలా హోర్డింగులు ఏర్పాటు చేసి, కరపత్రాలను పంపిణీ చేయాలని తెలిపారు. సందర్శకులకు అన్ని వివరాలు తెలిసేలా సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేడుకలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ నిర్మల్ ఉత్సవాల పేరిట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమం విజయవంతానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ సత్యం, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్ పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ ఉత్సవాలు విజయవంతం చేయాలి
నిర్మల్: ఈనెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ని ర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని అదన పు కలెక్టర్ కిశోర్‌కుమార్ అధికారులకు సూచించా రు. స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఏర్పాట్లను జి ల్లా అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. స్టేజ్, స్టాల్స్, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టాలని తెలిపా రు. ఆ యన వెంట ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖమర్‌అహ్మద్, తహసీల్దార్ రాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment